VZM: ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ రమేష్ రాజును నియమిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీర రమేష్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయనకు అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా కన్వీనర్‌గా వ్యవహరించిన దయానంద్ వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పించాలని కోరడంతో ఆయన స్థానంలో రమేష్‌ను కన్వీనర్ నియమించామన్నారు.