ఏలూరు: బుట్టాయగూడెంలో కరాటం రంగనాయకమ్మ కాలనీలో వినాయక చవితి అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవుళ్ళు సినిమా నిర్మాత కరాటం రాంబాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు ఆయన అన్నప్రసాదాలు వడ్డించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.