NTR: గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో తిరువూరు ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా అర్లపాడు గ్రామానికి చెందిన చేబ్రోలు హనుమంతరావు అనే వ్యక్తి బజాజ్ డిస్కవరీ బైక్‌లో అక్రమంగా తరలిస్తున్న 48 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై వర్మ తెలిపారు.