»Ys Viveka Case Inquiry Is Not Proper Waysajjala Ramakrishna Reddy
sajjala on viveka murder case:సజ్జల సంచలనం.. వివేకా కేసు తీరుపై సందేహాలు
sajjala on viveka murder case: మాజీ ఎంపీ వివేకానందరెడ్డి (vivekananda reddy) హత్య కేసులో సీబీఐ (cbi) విచారణ కీలకదశకు చేరింది. జగన్ బంధువు, ఎంపీ అవినాష్ రెడ్డిని (avinash reddy) సీబీఐ (cbi) మరోసారి విచారించింది. కేసు ముగింపు దశకు చేరిందని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ys viveka case inquiry is not proper way:sajjala ramakrishna reddy
sajjala on viveka murder case: మాజీ ఎంపీ వివేకానందరెడ్డి (vivekananda reddy) హత్య కేసులో సీబీఐ (cbi) విచారణ కీలకదశకు చేరింది. జగన్ బంధువు, ఎంపీ అవినాష్ రెడ్డిని (avinash reddy) సీబీఐ (cbi) మరోసారి విచారించింది. కేసు ముగింపు దశకు చేరిందని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని తెలిపారు. వివేకా (viveka) ఫోన్లో (phone) గల డేటా రికార్డులను ఎందుకు డిలీట్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy ) ప్రశ్నించారు. వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి (rajashekar reddy) ఫోన్ రికార్డులు ఎందుకు చూడలేదని నిలదీశారు. వైఎస్ వివేకా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వెల్లడించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేస్తే అవినాశ్ రెడ్డి వెళ్లారని వెల్లడించారు. ఈ కేసుతో అవినాశ్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ అంశంలో బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డకు సంబంధాలు ఉన్నాయని ఆధారాలు ఉన్నాయని సజ్జల తెలిపారు. శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయాడని చెప్పినట్టు ఆదినారాయణరెడ్డి వెల్లడించాడని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వివేకా హత్య కేసు ద్వారా తమ నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారు అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
చదవండి:magunta srinivasula reddy:రాఘవ ఏ తప్పు చేయలేదు: శ్రీనివాసుల రెడ్డి
వివేకానందరెడ్డిని కోల్పోవడం వైసీపీకి, జగన్కు నష్టమేనని తెలిపారు. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే జగన్ మనస్ఫూర్తిగా ఆహ్వానించారని తెలిపారు. వైఎస్ వివేకా హత్యకు, రెండో పెళ్లికి సంబంధం ఉందని ఓ పత్రికలో వేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా చెక్ పవర్ తీసేశారని అందులో పేర్కొన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఆయనను ఏకాకిని చేశారని కథనాలు వచ్చాయి. కొద్దిపాటి డబ్బు కోసం కూడా ఆయన ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అందులో వివరించారు అని సజ్జల వెల్లడించారు.
వైఎస్ వివేకా చుట్టూ నేర ప్రవృత్తి ఉన్న మనుషులు ఉన్నారని సజ్జల తెలిపారు. వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనేనని స్పష్టం చేశారు. కుట్రదారుల లక్ష్యం సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. వైఎస్ వివేకాను చంపిన హంతకులను పట్టుకోవాలని సజ్జల డిమాండ్ చేశారు.
గత ఎన్నికల కన్నా ముందు వివేకానంద హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ టెకొవర్ చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని వరసగా విచారిస్తోంది. కాల్ డేటా.. పరిశీలిస్తోంది. పథకం రచించింది ఎవరు? చంపింది ఎవరనే అంశంపై కూపీ లాగుతోంది. విచారణ తుది దశకు చేరుకున్న క్రమంలో సజ్జల కామెంట్స్ చర్చకు దారితీసింది.