కోనసీమ: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కపిలేశ్వరపురం మండలం, నిడసనమెట్ట, అంగర, కోరుమిల్లి, కేదార్లంక గ్రామాలకు చెందిన ఏడుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన రూ.4,26,484 విలువగల చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ఎంపీ గంటి హరీష్ మాధూర్ అందజేశారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు భరోసా కల్పిస్తోందన్నారు.