Tiger cubs : నంద్యాల పులి పిల్లలకు సిర్లాక్, చికెన్… తల్లి వెదుకులాటలో కీలక ఆధారాలు !
Tiger cubs : నంద్యాల జిల్లాలో నాలుగు పెద్ద పులి పిల్లల కనిపించిన ఘటనకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడి కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో సోమవారం కనిపించిన ఈ పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వీటి తల్లి ఆచూకీని కనుగొనడంలో ముందడుగు వేశారు.
Tiger cubs : నంద్యాల జిల్లాలో నాలుగు పెద్ద పులి పిల్లల కనిపించిన ఘటనకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడి కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో సోమవారం కనిపించిన ఈ పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వీటి తల్లి ఆచూకీని కనుగొనడంలో ముందడుగు వేశారు. ఇంకా తల్లి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విషయంపై ఆపరేషన్ కమిటీ మెంబర్, డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ ఆప్పవ్ ఐఎఫ్ఎస్ వివరించారు. పెద్ద గుమ్మాడాపురం అటవీ ప్రాంతంలో పెద్ద పులి అడుగుజాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించినట్లు తెలిపారు. అక్కడ ఓ గొర్రెల కాపరి, పండ్ల వ్యాపారి దాన్ని చూసినట్లు సమాచారం అందించగా అటవీ అధికారులు దాన్ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అయితే అది ఈ పిల్లల తల్లేనా? కాదా? అన్నది తేలాల్సి ఉందన్నారు.
* పులి పిల్లలకు సిర్లాక్, చికెన్ !
ఇటు ఆత్మకూరు మండలం బైర్లూటిలోని అటవీశాఖ గెస్ట్ హౌస్లో ఉన్న నాలుగు పులి పిల్లలు(Tiger Cubs) ఆరోగ్యంగా ఉన్నాయి. హుషారుగా ఆడుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిపుణుల సూచనలతో వాటికి పాలు, సెర్లాక్, చికెన్ లివర్ల(Chiken liver)ను అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 50కిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో అటవిశాఖ అధికారులు ‘ఆపరేషన్ తల్లి పులి’ని నిర్వహిస్తున్నారు . తల్లి పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. మొత్తం 40 ట్రాప్ కెమెరాలతో దాని కదలికలను ట్రేస్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్లనూ వినియోగిస్తారట. ఎలాగైనా సరే తల్లి పులిని పసిగట్టి ఈ నాలుగు పులి పిల్లలనూ దాని దగ్గరకు చేర్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు.