సికింద్రాబాద్-తిరుపతి మధ్య 16 కోచ్‌లతో కూడిన పూర్తి నిడివి గల ‘వందే భారత్’ రైలును త్వరలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) ట్వీట్ చేస్తూ ప్రకటించారు.
సికింద్రాబాద్-తిరుపతి(Secunderabad Tirupati)మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైన్(Vande Bharat train)కు మస్తు డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ప్రయాణికులు తిరుపతి వెళ్లేందుకు ఈ ట్రైన్ లో టిక్కెట్ల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఈ ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఆక్యుపెన్సీ కూడా 120 నుంచి 130 శాతం మధ్యలో ఉండటం విశేషం. ఈ క్రమంలో అనేక మందికి టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌లో 7 ఏసీ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ కోచ్ మొత్తం 8 ఉండగా..వీటిని 16కు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy)కి అనేక ఫిర్యాదులు రావడంతో కోచ్‌ల సంఖ్యను పెంచడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ తరహాలోనే కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులను కోరారు.
ఈ నేపథ్యంలో కేంద్రం అందుకు అంగీకరించిందని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) ట్వీట్ చేస్తూ వెల్లడించారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ కోసం 16 కోచ్‌లను పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి..రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కేవలం ఎనిమిది గంటలే ప్రయాణ సమయం కావడంతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. ప్రస్తుతం కోచ్ ల సంఖ్య పెరగడంతో ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనుంది.