ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో? సీఎం ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక
రాంచీలో జరుగుతున్న ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చివరి రోజున ఏపీకి చెందిన జ్యోతి యర్రాజీ(Jyothi Yarraji) రెండో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో జ్యోతి తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
సీబీఐ విచారణకు హాజరుకాని అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి సీబీఐ కేసులో కొత్త ట్విస్ట్ తల్లికి అనారోగ్యంగా ఉందని సీబీఐ అధికారులకు అవినాష్ లేఖ పులివెందులు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లి హైదరాబాద్ నుంచి పులి వెందుల బయలుదేరిన అవినాష్ రెడ్డి రెండోసారి విచారణకు హాజరు కాకపోవడంపై సీబీఐ సీరియస్ సీబీఐ కార్యాలయం నుంచి హడావిడిగా బయలుదేరిన రెండు వాహనాలు అవినాష్ ను మధ్యలో అడ్డుకునేందుకు అధికారుల ప్రయత్నం ఇప్పట...
తమిళనాడు తిరుచెందూర్ లోని మురుగన్ ఆలయాన్ని మంత్రి రోజా(Minister Roja) ఫ్యామిలీతో దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన క్రమంలో రజినీపై విమర్శల గురించి మీడియా ప్రశ్నించగా ఆమె వింతగా ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చారు. అది చూసిన రజినీ ఫ్యాన్స్ రోజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ(Bhuma Akhila Priya) అనారోగ్యం బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అఖిల ప్రస్తుతం కర్నూల్ సబ్ జైల్లో ఉన్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.
తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మే 26వ తేది నుంచి జూన్ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) నిర్వహించనున్నట్లు తెలిపింది.
తాత్కాలికంగా అద్దె లేదా లీజు ప్రాతిపదికన ఐదంతస్తుల భవనాన్ని తీసుకున్నారని సమాచారం. మొదటి అంతస్తులో పార్టీ కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు, మూడు అంతస్తుల్లో పరిపాలన విభాగం, ఐదో అంతస్తులో పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటుచేశారు.
తనపేరును వాడుకుని వాళ్లు డబ్బులు సంపాదించుకుని సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తానని చెప్పుకున్నారు. మా తండ్రి వర్ధంతి నాడు.. మా తండ్రి సాక్షిగా చెబుతున్నా.. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు.
జగన్ కు బంగారు గని దొరికిందా? బావి తవ్వుతుంటే వజ్రాలు దొరికాయా?’ అని వెంకటరమణా రెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్ కు తెలంగాణ, ఏపీతో సహా దేశంలో 9 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.
టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy)పై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Akhilapriya) దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దర్నీ పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు.