»No Special Category Status For Andhra Pradesh Centre Makes It Clear
Special category status for AP: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన కేంద్రం
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు కేటాయించిందా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందని, అందుకే ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని నిత్యానంద రాయ్ వెల్లడించారు. ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. 2015 నుండి 2018 వరకు ఈఏపీ కింద తీసుకున్న రుణాల పైన వడ్డీని కూడా చెల్లించినట్లు తెలిపారు.
2014లో ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో విభజిత ఏపీలో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ మొదటి నుండి వినిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం ఎప్పటికి అప్పుడు తెర పైకి వస్తోంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు మంచి ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. హోదా ముగిసిన అధ్యాయమని, దాని గురించి ఆలోచించవద్దని మొదటి నుండి చెబుతోంది. అయితే ఏపీకి హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని గుర్తు చేస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు నాటి చంద్రబాబు ప్రభుత్వం హోదా గురించి అడిగింది. అప్పుడే కేంద్రం స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇదే నినాదంతో గెలిచింది. తాము కేంద్రం మెడలు వంచి హోదా తీసుకు వస్తామని ప్రజలకు చెప్పింది. దీంతో ఏకంగా 151 స్థానాలు గెలిచింది. కానీ ఇప్పుడు వైసీపీ కూడా టీడీపీ బాటలో నడుస్తోంది. కేంద్రం మాత్రం మంచి ప్యాకేజీ ఇచ్చి, హోదా లోటును పూడుస్తున్నట్లు చెబుతోంది.