అన్నమయ్య: మదనపల్లెలోని బీ.టీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం NCC క్యాడెట్ల సెలక్షన్ కార్యక్రమం జరిగింది. సెలక్షన్ ప్రక్రియకు 42 మంది విద్యార్థులు హాజరుకాగా 20 మంది విద్యార్థులు NCCకి ఎంపికయ్యారు. 35 ఆంధ్రా బెటాలియన్ నుండి హవల్దార్ సతీశ్ కుమార్, నైబ్ సుబేదార్ రాకేశ్ లాల్ సెలక్షన్ ఆఫీసర్లుగా హాజరై ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.