ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA KotamReddy Sridhar Reddy)పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) కూడా సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తీర్మానం ప్రవేశపెట్టగా.. వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA KotamReddy Sridhar Reddy)పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తీర్మానం ప్రవేశపెట్టగా.. వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు. అంతకుముందు తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy)కోరారు. ఈ మేరకు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. ‘‘మీ ప్లేస్ కు వెళ్లండి.. వెళ్లి కూర్చోండి’’ అంటూ కోటంరెడ్డికి స్పీకర్ సూచించగా.. అందుకు ఆయన నిరాకరించారు. ఇది న్యాయం కాదని ఆయన అన్నారు.
అంతకుముందు తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ శ్రీధర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. కోటంరెడ్డి ని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని స్పీకర్(Speaker) చదవి వినిపించారు.. మొత్తం సెషన్ నుంచి ఆయనని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ తర్వాత కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై గొంతెత్తుతాననే తనకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. గాంధీగిరీ పద్ధతిలో నిలబడే నిరసన తెలిపానని చెప్పారు. తన వద్ద ఉన్న ప్లకార్డు తీసుకొని చించేశారని, ఇదేంటని అడిగితే సస్పెండ్ చేశారని ఆరోపించారు. వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) తెలిపారు. టీడీపీ సభ్యులను అందరిని సస్పెండ్ చేయాలని మరో మంత్రి దాడిశెట్టి రాజా (Minister Dadisetti Raja) స్పీకర్‌కు చెప్పారు. అలాగే మిగిలిన సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ వెల్లడించారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.