»7 Year Old Boy Who Fell In Madhya Pradesh Borewell Dies After Rescue
Breaking News : బోరు బావిలో పడిన బాలుడు.. బయటకు తీశాక చనిపోయాడు..!
Breaking News : బోరు బావిలో పడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 48 గంటల తర్వాత చిన్నారి క్షేమంగా బయటకు వస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. బాలుడిని బయటకు తీయడం అయితే తీశారు కానీ.. ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.
బోరు బావిలో పడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 48 గంటల తర్వాత చిన్నారి క్షేమంగా బయటకు వస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. బాలుడిని బయటకు తీయడం అయితే తీశారు కానీ.. ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.
ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన ఏడేళ్ల బాలుడిని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు 48 గంటల తర్వాత బయటికి తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స చేసిన వైద్యులు.. బాలుడు మరణించినట్లు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మంగళవారం జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడీ పత్తర్ గ్రామంలో ఉదయం 11 గంటల సమయంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకోవడానికి బయటకు వచ్చాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతానికి ఓ కోతుల గుంపు వచ్చింది. వాటిని చూసిన చిన్నారులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరిగెత్తారు.
ఈ క్రమంలో లోకేష్ కూడా ఎదురుగా ఉన్న పొలం వైపుగా పరిగెత్తుతూ.. ప్రమాదవశాత్తూ పొలంలో తెరచి ఉన్న 60 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. చిన్నారిని బయటకు తీసేందుకు ఆపరేషన్ ప్రారంభించింది.
48గంటల పాటు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే… చికిత్స పొందుతూ బాలుడు చనిపోవడం గమనార్హం.