»Minister Vidadala Rajani Gets Emotional While Talking About Cm Jagan
Vidadala Rajini : జగన్ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న మంత్రి విడదల రజిని
Vidadala Rajini : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి విడదల రజినీ అభిమానం చాటుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె... స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి విడదల రజినీ అభిమానం చాటుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె… స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై మంత్రి విడదల రజనీ ప్రసంగిస్తూ..ఏమోషనల్ అయ్యారు.
ఒక సాధారణ బీసీ మహిళ అయిన తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని, మంత్రిగా అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ రాజకీయ జీవితం, మంత్రి పదవి జగన్ పెట్టిన భిక్ష అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జగనన్న ఆరోగ్య సంస్కర్త అని రజని కొనియాడారు.
పేదల గుండెల్లో నిలిచిన నేత అని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి వచ్చిన జగన్ కు ఇక్కడి ప్రజల తరపున పాదాభివందనాలతో స్వాగతం పలుకుతున్నానని .. సంక్షేమ పథకాలతో జగన్ చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు. జగన్ గురించి చెబుతూ మంత్రి విడదల రజనీ కన్నీటిని అదుపు చేసుకోలేకపోయారు. జగనన్న ఆశయాల సాధనే లక్ష్యంగా పని చేస్తానని మంత్రి విడదల రజనీ చెప్పుకొచ్చారు. ఆయన ఆలోచన అమలే ధ్యేయంగా….ఆదర్శాలే ఆచరణగా, జగనన్న నాయకత్వమే అదృష్టంగా…ఆయన అప్పగించిన ప్రతీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటానని ఆమె చెప్పారు.