ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో (Manifesto) కమిటీ ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు(Ashok Babu), కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ నవంబరు 13న సమావేశం కానుంది. ఏపీలో సీఎం జగన్ (CM Jagan) లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఒకే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల నిర్ణయించాయి. టీడీపీ (TDP) ఇప్పటికే సూపర్ సిక్స్ పాయింట్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లింది.
పొత్తు అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘షణ్ముఖ వ్యూహం’ పేరిట మరో 6 అంశాలు ప్రతిపాదించారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ పవన్ ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజా మేనిఫెస్టోకు రూపకల్పన చేయనుంది.నవంబర్ 17 నుంచి ‘భవిష్యతు భరోసా’ కార్యక్రమంలో పాల్గొంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు (Achchennaidu) తెలిపారు. నవంబ ర్ 9న ఇక్కడ జరిగిన రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అచ్చెన్నాయుడు మీడియాకు వివరిస్తూ ఇకపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు రెండు పార్టీలు సమిష్టిగా కృషి చేస్తాయని చెప్పారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అనంతరం కరువు ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు.