SC: మాదిగల చిరకాల కోరిక నెరవేరుస్తామని ప్రధాని మోడీ (modi) హామీనిచ్చారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు హాజరయ్యారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించాం.. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం కమిటీని నియమిస్తామని తెలిపారు. న్యాయం జరిగేలా చూస్తాం అని ప్రకటన చేశారు.
అంతకుముందు స్టేజీపై మందకృష్ణ మాదిగ ఉద్వేగానికి గురయ్యారు. సమాజం తమను పశువుల కన్నా హీనంగా చూసిందని తెలిపారు. తమ జాతికి జరిగిన అన్యాయాన్ని చెబుతూ కంట తడి పెట్టారు. ఆ సమయంలో మందకృష్ణ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయనను భుజం తట్టి మరి ఓదార్చారు మోడీ. ఆ వీడియో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కాగా.. తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
బలహీన వర్గాలకు అండగా ఉండేది బీజేపీ ఒక్కటే.. తెలంగాణకు బీసీని సీఎం చేస్తానని ప్రకటించింది అని మందకృష్ణ అన్నారు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతి చేసిన ఘనత ప్రధాని మోడీదేనని వివరించారు. సభ ముగిసి.. వెళ్లే సమయంలో కూడా మందకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో కూడా మోడీ తాము ఉన్నామని వెన్నుతట్టారు.