ఒలింపిక్స్(Olympics)లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prattipati Pullarao) విమర్మించారు.రాష్ట్రంలో సిటిజన్స్ క్లబ్బులను మూసేసి పేకాట క్లబ్‌లు తెరిచారని వైసీపీ ప్రభుత్వం (YCP GOVT) యెద్దేవా చేశారు. అనధికారికంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు (Pekata klablu) నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. చిలకలూరిపేట(Chilakaluripet )పేకాటకు అడ్డాగా మారిందన్నారు.
చదవండి : Pawan Kalyan: పాక్ బోర్డర్లో గుర్రం మీద సవారీ చేయాలి, పేర్ని నానిపై పవన్ విసుర్లు
సగటును రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారని వెల్లడించారు.పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. విడదల రజని(Vidadala rajani) మహిళా మంత్రిగా ఉండి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.పేకాట క్లబ్‌ల ద్వారా మంత్రి రజిని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారన్నారు.
చదవండి : Allu Arjun : ఏఏఏ సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభించిన బన్నీ

