PPM: సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బూర్జ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి వెల్లడించారు. ఈ మేరకు పాపమ్మవలస గ్రామంలో శనివారం ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ హేమాక్షి పలువురికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు.

