కృష్ణా: బుద్ధ పౌర్ణమి వేడుకలు చల్లపల్లి మండలం పాగోలులో ఘనంగా జరిగాయి. బుధవారం ఎన్టీఆర్ స్కూలులోని మహా బోధి విహారంలో బుద్ధుని విగ్రహాలకు విద్యార్థులు పూజలు చేశారు. బౌద్ధ ఉపాసకులు చోడవరపు ఆదినారాయణ పంచశీల సూత్రాలు వివరించారు. అనంతరం బోధి వృక్షానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డీ.అప్పలనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.