CTR: కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి శ్రీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని, ఆలయ ఏఈవో రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, తదితరులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.