ATP: సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురంలో సంప్రదాయ ముగ్గులు ఆకట్టుకుంటున్నాయి. గురువారం తెల్లవారుజామునే మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి హరిదాసులకు స్వాగతం పలికారు. గొబ్బెమ్మలు, పూలతో అలంకరించిన ఈ రంగవల్లులు వీధుల్లో పండుగ శోభను పెంచాయి. నగరవ్యాప్తంగా ప్రతి ఇంటా పండుగ సందడి నెలకొంది.