చిత్తూరు: ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రాజశేఖర రాజు, డీఎస్పీ సాయినాథ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 32 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భాగంగా అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అన్ని ఫిర్యాదులపై చట్టబద్ధమైన విచారణ జరిపి, గడువులోగా సమస్యలు పరిష్కరించాలన్నారు.