కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తన భార్య పేరుని అకారణంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్లో చేర్చిందని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. నేడు బెయిల్ పిటిషన్పై జిల్లా కోర్టు తీర్పు వెల్లడించనుంది. కాగా బెయిల్ పిటిషన్ తీర్పుపై వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.