కృష్ణా: వార్షిక తనిఖీల్లో భాగంగా చందర్లపాడు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏసీపీ తిలక్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వారితో గౌరవంగా మాట్లాడి వారి ఫిర్యాదు సేకరించి వారి సమస్యలను పరిష్కరించాలని సీఐ చవాన్, ఎస్సై దుర్గ మహేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు.