కడప: YCP గ్రామ కమిటీలో ప్రతి వర్గానికి చెందిన వ్యక్తులకు చోటు కల్పించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లె గ్రామంలో సోమవారం YCP గ్రామస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుంచి కమిటీలను నియమించామన్నారు. అందరూ కష్టపడి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.