సత్యసాయి: సోమందేపల్లి మండలం నడింపల్లిలో పాప నాసేశ్వర ఆలయ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. పోలేపల్లి నరసింహులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ పాపనాసేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎంతో శక్తివంతమైన శివాలయంగా ఈ గుడికి పేరు ఉందన్నారు. పోలేపల్లి, నడింపల్లి, పెద్దబాబయ్యపల్లి ప్రజల సహకారంతో ఈ గుడి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.