VSP: కులం పేరుతో దూషించిన కారణంగా విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ 12వ అదనపు న్యాయమూర్తి సత్యదేవి సోమవారం తీర్పు ఇచ్చారు. ఎస్సీ కులానికి చెందిన ఓ మహిళతో 2017లో నారాయణమూర్తి ఒప్పందం కుదుర్చుకుని రూ.1.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.