కడప: ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించేందుకు మంగళవారం వరకు గడువు ఉందని ముద్దనూరు మండల వ్యవసాయాధికారి మారెడ్డి వెంకట క్రిష్ణా రెడ్డి తెలిపారు. రబీ సీజన్లో వేసిన వేరుశనగ, శనగ, నువ్వులు, మినుములు, పెసర, పొద్దుతిరుగుడు, వరి పంటలకు ఫసల్ బీమా కింద రైతులు ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఏఓ కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.