ప్రకాశం: అండర్-17 ఫెన్సింగ్ జిల్లా క్రీడాపోటీలను ఒంగోలులోని పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఛైర్మన్ సాయి, వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30వ తేదీ భీమవరం వెస్ట్ బెర్రీ పాఠశాలలో జరిగే అండర్-17 క్యాడెట్ 11వ రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా తరుపున పాల్గొంటారు.