GNTR: వెలగపూడిలోని వృద్ధురాలు మరియమ్మ హత్య కేసులో 34 మంది నిందితులను తుళ్ళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అరెస్టు చేసిన 34 మందిని పోలీసులు మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ రోజు అరెస్టు అయిన నిందితులల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు.