CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి తవణంపల్లి మండలం సత్తపచేనుకు చెందిన దాత యశ్వంత్ కుటుంబసమేతంగా ఒక కిలో వెండి కిరీటం బహుకరించారు. వెండి కిరీటం విలువ లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.