ATP: పెద్దవడుగూరు మండలం కిష్టిపాడుకు చెందిన రాజేశ్వరి 2022లో గుత్తి బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రాజేశ్వరి పలుసార్లు పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. మూడు సంవత్సరాలు తర్వాత మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు బుధవారం మీడియా తెలిపారు.