VZM: జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘంగా సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన హెడ్ కానిస్టేబులు ఒమ్మి గౌరీ ప్రసాదరావుకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ శనివారం ఘనంగా ‘ఆత్మీయ వీడ్కోలు’ పలికారు. జిల్లా పోలీసుశాఖ తరుపున ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, సాలువలతోను, పూల మాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను ప్రధానం చేశారు. పోలీసుశాఖకు సుదీర్ఘంగా సేవలందించడం అభినందనీయమన్నారు.

