కడప: సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే నెల జనవరి 3న జిల్లాకు రానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించిన పేదల గృహాలను సీఎం పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అయితే సీఎం చంద్రబాబు జిల్లాలో ఏ ఊరిలో పర్యటిస్తారనేది త్వరలోనే తెలియనుంది. సీఎం పర్యటనపై జిల్లా అధికారులకు సమాచారం అందింది.