ATP: వైసీపీ సోషల్ మీడియా ఏర్పాటు చేసిన ట్విట్టర్ స్పేస్లో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యకర్తలు ఆధైర్య పడద్దని, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో గళం విప్పాలని వివరించారు.