కృష్ణా: గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో జరుగుతున్న 7వ ప్రపంచ మాదిగ దినోత్సవం కార్యక్రమం సోమవారం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యక్రమంలో స్వయంగా డప్పు కొట్టి పలువురిని అలరించారు. ఈ కార్యక్రమంలో కొలికపూడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకలు సందర్భంగా కొలికపూడి కొద్దిసేపు మాట్లాడారు.