కోనసీమ: జనవరి 5వ తేదీన విజయవాడలో నిర్వహించే హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని RSS, విశ్వహిందూ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు. మామిడికుదురు మండలంలోని మగటపల్లి గ్రామంలో ఆదివారం మాజీ ZP ఛైర్మన్ నామన రాంబాబుకు RSS , విశ్వహిందూ పరిషత్ నాయకులు హైందవ శంఖారావం సభకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.