కోనసీమ: పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వచ్చే నెల 4న జిల్లాస్థాయి విద్యా విజ్ఞాన ప్రదర్శన పోటీలను నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీలను కలెక్టర్ మహేశ్ కుమార్, పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభిస్తారని తెలిపారు.