NTR: పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సందడిగా సాగింది. పాతికేళ్ల తర్వాత తమ పాఠశాలలో కలుసుకున్న విద్యార్థులు, తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ అపూర్వ కలయిక ఎంతో ఆనందాన్నిచ్చిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.