W.G: నిడదవోలు మండలం డి.ముప్పవరంలో ఆదివారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సమిశ్రగూడెం ఎస్ఐ వీరబాబు తెలిపారు. భర్త త్రినాధ్ మద్యానికి బానిస కావడంతో భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన అతని భార్య కుమారి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.