కోనసీమ: జనవరి 5న విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ సభ్యులు మంత్రి సుభాష్‌కి ఆదివారం ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. జనవరి 5న హైందవ శంఖారావ కార్యక్రమానికి ప్రతి హిందువు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.