KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో శ్రీమద్ భగవద్గీత పారాయణంపై అవగాహన కార్యక్రమాలు సోమవారం భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వక్తలు ప్రసంగించిన గీతా పారాయణం, మహా విష్ణు సహస్ర పారాయణాన్ని ఆలకించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.