VZM: యువత క్రీడలపై ఆశక్తి చూపాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతి రాజు అన్నారు. ఈనెల 22 నుంచి 24 వరకు రావుల పాలెంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లాకు చెందిన క్రీడాకారులను ఆదివారం పార్టీ కార్యాలయంలో అభినందించారు. క్రీడలతో మంచి భవిష్యత్ ఉంటుందని, క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.