W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాజ్జి మాట్లాడుతూ ఇంటి వద్ద నిర్మించిన ఈ కార్యాలయాన్ని కార్యకర్తల, ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.