ELR: జీలుగుమిల్లి మండలం పి. రాజవరంలో సుంకం చెల్లించని 13 తెలంగాణ మద్యం సీసాలతో ఒక మహిళపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీనుబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో తనిఖీలు నిర్వహించిన సమయంలో వీటిని గుర్తించామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకటలక్ష్మి, సుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారన్నారు.