ప్రకాశం: పిఠాపురం వేదికగా మాజీ సీఎం జగన్పై జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, YCP బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు బొట్ల రామారావు మండిపడ్డారు. బాలినేని వ్యాఖ్యలను ఖండిస్తూ సింగరాయకొండలో సమావేశం నిర్వహించారు. పదవుల కోసం పవన్ కళ్యాణ్ భజన చేస్తున్న బాలినేని.. జగన్ గురించి అనుచిత మాటలు మాట్లాడటం తగదన్నారు.