KRNL: కోసిగిలో గర్భిణీ కంట కన్నీరే మిగిలింది. 8నెలల గర్భిణీ అంజలి బ్యాంకు పని కోసం వెళ్లగా మెట్లు ఎక్కలేక తీవ్ర రక్తస్రావం జరిగిందని భర్త రమేశ్ తెలిపారు. స్థానికుల సహకారంతో PHCకి తీసుకెళ్లగా డాక్టర్లు ప్రసవం చేశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడన్నారు. ఇదంతా బ్యాంకు మెట్లు ఎక్కడంతో జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు.