ప్రకాశం: మార్కాపురం మండలం నికరంపల్లిలో సోమవారం ఉదయం ఎమ్మార్వో చిరంజీవి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సును ప్రజలంతా వినియోగించుకోవాలని, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.