NTR: తిరువూరు మండలం కాకర్లలో శనివారం సైబర్ నేరాలపై గ్రామస్థులకు సీఐ గిరిబాబు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడిగితే ఎవరికీ చెప్పొద్దని, డిజిటల్ అరెస్టులతో మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ వాట్సాప్‌లోకి వచ్చే లింకులను నొక్కొద్దని సూచించారు.