Buddha Venkanna: టమాటో (Tomatoes) ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కిలో రూ. 150కి పైనే పలుకుతున్నాయి. దీంతో సామాన్యుడు టమాటో వంక కూడా చూడటం లేదు. ప్రతీ కూరలో టమాట కంపల్సరీ.. సో పేద, మధ్యతరగతి వారికి టమాట పంపిణీ కోసం రాజకీయ పార్టీలు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ నేతలు టమాట పంపిణీలో బిజీగా ఉన్నాయి. వైసీపీ నేతలు కిలో రూ.50కి విక్రయించగా.. టీడీపీ నేతలు కిలో రూ.30కి అందజేస్తున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కిలో టమాట రూ.30కి విక్రయించారు. పేదలు అయితే ఉచితంగానే అందజేస్తునారు. తన సొంత డబ్బులతో రోజు 500 కిలోల టమాట పంపిణీ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తెలిపారు. తోపుడుబండిపై టమాటలు తీసుకొచ్చి వన్ టౌన్ రథం సెంటర్ వద్ద పంపిణీ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని బుద్దా వెంకన్న (Buddha Venkanna) విమర్శించారు. ధరలను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వాలంటీర్లతో ఇంటింటికీ రెండు కిలోల టమాటలను సబ్సిడీపై అందజేయాలని కోరారు. టమాట నిత్యావసర వస్తువు అయినందున.. పేద, మధ్య తరగతి ప్రజలను అందజేయాలని డిమాండ్ చేశారు.