నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రులు ముప్పేట దాడి చేశారు. రంగంలోకి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దిగింది. టీడీపీలోకి వెళతానని కోటంరెడ్డి అనుచరులతో చెప్పారని గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్లో కూడా అవకాశం ఉందంటున్నారు. సీఎం జగన్‌ను కోటంరెడ్డి ఏకవచనంతో పిలువడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు. ఆ ఫోన్ కాల్ సంభాషణ ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
మించిపోయింది లేదు.. క్షమాపణ చెప్పు
ఫోన్ చేసి తనను తాను అనిల్ పరిచయం చేసుకున్నాడు. ఇట్ల చేసినవ్ అన్న అని ఫోన్ కాల్ స్టార్ట్ చేశాడు. రాజశేఖర్ రెడ్డి, రాజా రెడ్డి వద్ద పనిచేసినా అని చెప్పి ఇలానేనా అని ప్రశ్నించాడు. ఎట్లన్నా తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అని ఫైరయ్యాడు. అనిల్ నువ్వు ఆవేశంలో ఉన్నావ్.. నేరుగా మాట్లాడుకుందాం అని కోటంరెడ్డి చెప్పిన వినిపించుకోలేదు. గత ఎన్నికల్లో జగన్ చరిష్మా లేకుండా గెలిచావా అని అడిగాడు. జగనే తనకు టికెట్ ఇచ్చాడని మీడియా సమావేశంలో చెప్పానని కోటంరెడ్డి వివరించాడు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు.. జగన్ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని అనిల్ స్పష్టంచేశాడు. ఓకే.. అనిల్ థాంక్యూ అని కోటంరెడ్డి ఆన్సర్ ఇచ్చాడు.
బండికి కట్టి ఈడ్చుకెళతా..
జగన్‌ను గారూ అని పిలువకున్నా బాగోదు అని అనిల్ బెదిరించాడు. మరోసారి ఇలా చేస్తే రోడ్డు మీద ఈడ్చుకెళతా.. బండికి కట్టుకొని తీసుకెళ్తా అని వార్నింగ్ ఇచ్చాడు. జగన్ గురించి మాట్లాడే సమయంలో నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలె అన్నారు. నీకు జగన్ రాజకీయ భిక్ష పెడితే మద్రాస్ ఆస్తులు సంపాదించుకోలేదా అని అడిగారు. ఏ ఆస్తులు.. లేవు, చూపెడితే తీసుకో అని కోటంరెడ్డి చెప్పబోయాడు. గమ్మున ఉండు.. అన్న అని అతనిని మాట్లాడనీయలేదు. నువ్వ ఆవేశంతో మాట్లాడుతున్నావ్.. అనిల్ అని చెప్పినా వినిపించుకోలేదు.
I hate kotamreddy.. But oka veedhi rowdyy ila mla ni bedirinchadam enti😒 https://t.co/0IvNCPF5rj
టీడీపీలోకి వెళ్లు.. నో ప్రాబ్లమ్
టీడీపీలోకి వెళ్తానంటే వెళ్లు.. సమస్య లేదని కోటంరెడ్డితో అనిల్ అన్నాడు. నీ తమ్ముడు ఎక్కువ చేస్తున్నాడని చెప్పాడు. తగ్గించుకోని మాట్లాడాలని సూచించాడు. లేదంటే ప్రజాగ్రహనికి గురికాక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. నేరుగా కలిసి మాట్లాడదాం అని కోటంరెడ్డి పలుమార్లు చెప్పాడు. అయినా తాను చెప్పాలి అనుకుంది చెప్పేశాడు. ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ట్రోల్ అవుతుంది. పోస్ట్‌కు అనుకూల, వ్యతిరేక కామెంట్లు వస్తున్నాయి. అన్న.. మేమున్నాం అని కొందరు అంటున్నారు. ఎవరు అనిల్.. నెల్లూరు రమ్మను అని చెబుతున్నారు.